రండి బాబు, రండి.. టీకా వేసుకోండి.. స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి!: అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పిలుపు
- మురికి వాడల్లో నత్తనడకన వ్యాక్సినేషన్
- ప్రతి ఒక్కరికీ వంట నూనె ప్యాకెట్ల పంపిణీ
- లక్కీ డ్రాలో రూ. 10 వేల విలువైన సెల్‌ఫోన్
- టీకా కోసం పోటెత్తుతున్న జనం
మరీ ముఖ్యంగా ఇక్కడి మురికివాడల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. దీంతో లక్ష్యాన్ని సాధించేందుకు నడుంబిగించిన అధికారులు టీకా వేయించుకున్న వారికి వంటనూనె ప్యాకెట్లు అందిస్తున్నారు. అలాగే టీకా వేసుకున్న వెంటనే ఓ కూపన్ అందిస్తున్నారు. ఈ కూపన్లకు డ్రా తీసి గెలుపుపొందిన వారికి రూ. 10 వేల విలువైన ఫోన్లు అందిస్తున్నారు. ఒక్క శనివారమే 10 వేల వంటనూనె ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఈ విషయం తెలియడంతో ఆదివారం టీకా వేయించుకునేందుకు జనం పోటెత్తారు. నిన్న ఏకంగా 20 వేల నూనె ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తీసిన లక్కీ డ్రాలో ఇప్పటి వరకు 25 మంది సెల్‌ఫోన్లు గెలుచుకున్నారు. ఈ మొత్తం కార్యక్రమంలో యువ అన్‌స్టాపబుల్ ఆర్గనైజేషన్ సహకరిస్తోందని ఏఎంసీ అధికారి ఒకరు తెలిపారు.