హైదరాబాద్‌లో మరో కలకలం... బాలికపై అత్యాచారం.. నిందితుడిని పట్టుకున్న స్థానికులు
- మంగళ్‌హాట్ పరిధిలో ఘటన
- నిందితుడి పేరు సుమిత్‌గా గుర్తింపు
- కోఠి ఆసుపత్రికి బాలిక తరలింపు
గత రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు. బాలిక అరుపులు పెట్టడంతో ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు సుమిత్ అనే యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సుమిత్‌పై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి.
హబీబ్ నగర్ పరిధిలో జరిగిన ఓ చోరీ కేసులోనూ అతడు నిందితుడిగా ఉన్నాడు. బాలిక నివసించే ప్రాంతానికి పోలీసులతో కలిసి చేరుకున్న ఏసీపీ నరేందర్ రెడ్డి అత్యాచార ఘటనపై విచారణ జరుపుతున్నారు. మొదట బాలికను భరోసా కేంద్రానికి తరలించి, అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం కోఠి ఆసుపత్రికి తరలించారు.