Tollywood: దయాదాక్షిణ్యాలు లేని ‘ఘోస్ట్​’ వచ్చేశాడు.. ఇదిగో మన్మథుడు నాగ్​ కొత్త సినిమా మోషన్​ పోస్టర్​, ఫస్ట్​ లుక్​

Ghost Arrives With No Mercy At All
షార్ట్స్‌లో చూడండి
‘ఘోస్ట్’ వచ్చేశాడు. దయాదాక్షిణ్యాలు లేకుండా రాక్షసులను వేటాడేందుకు కత్తి పట్టి సమరం చేసేందుకు సన్నద్ధమయ్యాడు. ఇప్పటికే ఘోస్ట్ సగం రూపాన్ని బయటపెట్టిన సినీ బృందం.. ఇవాళ కింగ్ నాగార్జున జన్మదినం సందర్భంగా ‘ఘోస్ట్’ పూర్తి రూపాన్ని బయటపెట్టింది. దాంతో పాటు ఓ మోషన్ పోస్టర్ నూ వదిలింది. గుంటూరు టాకీస్, పీఎస్వీ గరుడవేగ వంటి హిట్ సినిమాలను అందించిన ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఈ సినిమా రానుంది.


శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు సంయుక్తంగా ‘ఘోస్ట్’ను నిర్మిస్తున్నారు. ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రంలో నాగ్ కు జోడీగా కాజల్ అగర్వాల్ కనిపించనుంది. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లో నాగ్ ఇంటెన్సిటీ మామూలుగా లేదు.

‘‘అతడిని ఎవరూ చంపలేరు.. అతడి నుంచి పారిపోలేరు.. అతడితో చర్చలూ సాధ్యం కాదు. కేవలం దయ కోసం ప్రాధేయపడాలి’’ అంటూ మోషన్ పోస్టర్ సాగింది. ఘోస్ట్ కు ట్యాగ్ లైన్ గా ‘నో మెర్సీ (దయన్నదేలేదు)’ని పెట్టారు. కాగా, నాగ్ ఇవాళ 63వ వసంతంలోకి అడుగుపెట్టారు. 1959 ఆగస్టు 29న ఆయన జన్మించారు.
Go Back to Shorts
Tollywood
Nagarjuna
Akkineni
Praveen Sattaru
The Ghost
Kajal Aggarwal

More Telugu News