Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

corona bulletin in inida
  • దేశంలో నిన్న 45,083 క‌రోనా కేసులు
  • కేసుల సంఖ్య మొత్తం 3,26,95,030
  • క‌రోనాతో మ‌రో 460 మంది మృతి
  • మొత్తం మృతుల సంఖ్య 4,37,830
దేశంలో నిన్న 45,083 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,26,95,030కి చేరింది. అలాగే, నిన్న 35,840 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 460 మంది మృతి చెందారు.

దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,37,830కి పెరిగింది. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,18,88,642 మంది కోలుకున్నారు. 3,68,558 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. రిక‌వ‌రీ రేటు 97.53 శాతంగా ఉంది. కేర‌ళ‌లో నిన్న ఏకంగా 31,265 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 153 మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News

Corona Virus
COVID19
India