తెలంగాణలో రావణరాజ్యం.. బండి సంజయ్ పాదయాత్రతో అంతం: తరుణ్‌చుగ్
- గాంధీ యాత్రతో బ్రిటిషర్లు, మిషన్ పోలోతో నిజాం పాలన అంతమైంది
- టీఆర్ఎస్ జానేవాలా.. బీజేపీ ఆనేవాలా తథ్యం
- ప్రజల ఆకాంక్షలు కేసీఆర్ ఫామ్ హౌస్‌లో బందీ: డీకే అరుణ
పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు కేసీఆర్ ఫామ్ హౌస్‌లో బందీ అయ్యాయని విమర్శించారు. కాగా, నేడు రెండో రోజు పాదయాత్ర 9 గంటలకు ప్రారంభం అవుతుంది. నానల్‌నగర్ చౌరస్తా, టోలిచౌకి చౌరస్తా, షేక్‌పేట నాలా మీదుగా షేక్‌పేట చేరుకుంటుంది. బండి సంజయ్ మధ్యాహ్న భోజనం అక్కడే చేస్తారు. అనంతరం గోల్కొండ చేరుకుని సాయంత్రం నాలుగు గంటలకు అక్కడి సభలో ప్రసంగిస్తారు. తర్వాత గోల్కొండ చోటా బజార్, లంగర్‌హౌస్ చెరువుకట్ట, లంగర్‌హౌస్ చౌరస్తా మీదుగా బాపూఘాట్‌కు పాదయాత్ర చేరుకుంటుంది. రాత్రికి అక్కడికి సమీపంలో ఏర్పాటు చేసిన గుడారాల్లో బస చేస్తారు.