చిరూ 153వ మూవీ 'టైటిల్ పోస్టర్' రిలీజ్ కి ముహూర్తం ఖరారు!
- చిరూ 153వ సినిమాగా 'లూసిఫర్' రీమేక్
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
- దర్శకుడిగా మోహన్ రాజా
- రేపు సాయంత్రం టైటిల్ పోస్టర్ రిలీజ్
అయితే ఈ 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు కావడంతో, ఆ రోజున ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ రావొచ్చని అనుకున్నారు. అభిమానుల అంచనాలకు తగినట్టుగానే, ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రకటన ఇచ్చేశారు. రేపు సాయంత్రం 5:04 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఫస్టులుక్ తో కూడిన టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.