రిబ్బన్ కట్ చేద్దామంటే కత్తెర లేదు... సీఎం కేసీఆర్ ఏంచేశారో చూడండి!
- సిరిసిల్లా జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
- పలు అభివృద్ధి పనులు ప్రారంభం
- డబుల్ బెడ్రూం ఇళ్లకు పూజా కార్యక్రమాలు
- చేత్తోనే రిబ్బన్ లాగిపారేసిన కేసీఆర్
అధికారులు, సిబ్బంది ఒకర్నొకరు కత్తెర ఏదంటూ ప్రశ్నించుకోవడం సీఎం కేసీఆర్ ను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. కాసేపు వేచిచూసిన ఆయన కోపంతో రిబ్బన్ ను చేత్తోనే పీకి పారేశారు. ఆపై లబ్దిదారులతో కలిసి డబుల్ బెడ్రూం ఇంటిలోకి ప్రవేశించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.