తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కోకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు
- సీఎండీ ప్రభాకర్ రావు సహా ఉన్నతాధికారులకు సమన్లు
- విధుల్లోకి తీసుకోవట్లేదంటూ 84 మంది ఉద్యోగుల పిటిషన్
- ధర్మాధికారి నివేదిక ప్రకారం సగం మందిని తీసుకున్న ఏపీ
ధర్మాధికారి నివేదిక ప్రకారం 1,150 మంది విద్యుత్ ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు సమానంగా కేటాయించారు. అందులో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 655 మందిని విధుల్లోకి తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వమూ తీసుకున్నా.. 84 మందిని మినహాయించి విధుల్లోకి తీసుకుంది. దీంతో ఆ ఉద్యోగులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. అధికారులకు నోటీసులిచ్చి విచారణను జులై 16కి వాయిదా వేసింది.