50 కిలోల బరువుతో కదల్లేకపోతున్న శునకం.. బేరియాట్రిక్ సర్జరీ చేసిన వైద్యులు
- దేశంలోనే తొలిసారి శునకానికి బేరియాట్రిక్ సర్జరీ
- సర్జరీ కోసం రూ. 1.20 లక్షలు ఖర్చు చేసిన యజమాని
- ఆపరేషన్ చేసి 5 కిలోల కొవ్వును తొలగించిన వైద్యులు
‘దీపిక’ను పరీక్షించిన నిపుణులు దానికి బేరియాట్రిక్ సర్జరీ చేయించాలని సూచించారు. ఫలితంగా శునకం బరువు తగ్గి సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు. దీంతో 8 ఏళ్ల 6 నెలల వయసున్న ‘దీపిక’కు రూ. 1.20 లక్షల ఖర్చుతో ల్యాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ఆపరేషన్ చేయించారు. శునకానికి ఆపరేషన్ చేసిన వైద్యులు దానిలో పేరుకుపోయి 5 కిలోల అదనపు కొవ్వును తొలగించారు. ఫలితంగా శునకం బరువు 45 కిలోలకు చేరుకుంది. ‘దీపిక’ ఇప్పుడు నడవగలుగుతోందని యాస్మిన్ తెలిపారు.