రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం గురించి తెలుసుకుని షాక్ అయ్యాను: సుమలత
- ఎంపీపై పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం దిగ్ర్భాంతికరం
- ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నా
- రఘురామరాజుకు పూర్తి మద్దతుగా ఉంటా
ఈ విషయాన్ని తాను నమ్మలేకపోతున్నానని, దీని గురించి తెలుసుకుని విస్మయానికి గురయ్యానని చెప్పారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ తీరు ఆంధ్రప్రదేశ్ పోలీసులపై చెడు ప్రభావం చూపిస్తుందని అన్నారు. తన సహచర ఎంపీ రఘురామరాజుకు పూర్తి మద్దతుగా ఉంటానని ఆమె చెప్పారు. ఆయనపై జరిగిన ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలుపుతూ ట్వీట్ చేశారు.