ఎవరెస్ట్ శిఖరంపై కాలుమోపిన ఏపీ యువకుడు అనిమిష్ వర్మ
- విశాఖ యువకుడి ఘనత
- ఈ నెల 1న ఎవరెస్ట్ అధిరోహణ
- సాయపడిన అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ
- గతంలో కిలిమంజారో, అకాంగువా పర్వతారోహణ
అనిమిష్ 2017 నుంచి పర్వతారోహణపై ఆసక్తితో కఠిన శిక్షణ పొందాడు. ప్రత్యేక శిక్షణలో భాగంగా లఢఖ్ లో మంచు పర్వతాన్ని అధిరోహించాడు. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకు పడిపోయినా అనిమిష్ వెనుకంజ వేయలేదు. అంతేకాదు, గతేడాది ఆఫ్రికాలోని కిలిమంజారో, సౌత్ అమెరికాలోని అకాంగువా పర్వతాలను కూడా అధిరోహించాడు. ఎంబీఏ చదివిన అనిమిష్ కు మార్షల్ ఆర్ట్స్ లోనూ నైపుణ్యం ఉంది. వరల్డ్ కిక్ బాక్సింగ్, కరాటే పోటీల్లో అనేక పతకాలు సొంతం చేసుకున్నాడు.