ఆమె నా భర్త గాళ్ ఫ్రెండ్ కాదు.. తెలిసిన వ్యక్తి.. అంతే!: మెహుల్ చోక్సీ భార్య స్పష్టీకరణ
- గాళ్ ఫ్రెండ్ వార్తలపై స్పందించిన చోక్సీ భార్య ప్రీతి
- భారత్కు సజీవంగా రప్పించాలనుకున్నప్పుడు హింసించడం ఎందుకని ప్రశ్న
- మానవహక్కుల ఉల్లంఘనేనని ఆవేదన
డొమినికా జైలులో ఉన్న చోక్సీని హింసిస్తున్నారంటూ వస్తున్న వార్తలపైనా ప్రీతి స్పందించారు. ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘనేనన్నారు. ఆయనను సజీవంగా భారత్కు రప్పించాలనుకున్నప్పుడు ఇలా హింసించాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. తన భర్తకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఇలా హింసించడం తగదని అన్నారు. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైలులో ఉన్నాడు.