'గూని బాబ్జీ'గా రావు రమేశ్!
- అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం'
- ప్రధాన పాత్రల్లో శర్వానంద్ - సిద్ధార్థ్
- కీలకమైన పాత్రలో రావు రమేశ్
- విలక్షణమైన నటుడిగా విపరీతమైన డిమాండ్
ఈ రోజున ఆయన పుట్టిన రోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'మహా సముద్రం' సినిమాలో ఆయన పాత్రకి సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయన 'గూని బాబ్జీ' పాత్రను పోషిస్తున్నారు. ఆ పాత్రను పరిచయం చేస్తూ, ఆయన లుక్ కి సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఇక ఈ పాత్రతో ఆయన 'మహా సముద్రం'ను ఎంతలా అల్లకల్లోలం చేస్తాడో చూడాలి. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ - సిద్ధార్థ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే