థియేటర్లకే రానున్న 'బ్యాచ్ లర్'
- అఖిల్ తాజా చిత్రంగా రానున్న 'బ్యాచ్ లర్'
- ఓటీటీలో రిలీజ్ అంటూ ప్రచారం
- క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు
అఖిల్ - పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందనీ, ఈ ఇద్దరి మధ్య రొమాన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని చెప్పారు. ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయనున్నామని స్పష్టం చేశారు. నిజానికి అఖిల్ కెరియర్ కి ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం. ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనే బలమైన నిర్ణయానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. నిర్మాతల నుంచి క్లారిటీ వచ్చేసింది కనుక, ఈ పుకార్లకు తెరపడిపోయినట్టే! ఇక చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న 'బొమ్మరిల్లు' భాస్కర్ కి కూడా ఈ సినిమా విజయం కీలకమే.