కుమార్తె పెళ్లిపై వివరణ ఇచ్చిన పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది
- షాహిద్ అఫ్రిదీ అల్లుడిగా రానున్న షహీన్ అఫ్రిదీ
- అక్సా పెళ్లి చేయాలని నిర్ణయించిన షాహిద్ అఫ్రిదీ
- ప్రస్తుతం వైద్య విద్య అభ్యసిస్తున్న అక్సా
- షహీన్, అక్సాలకు గతంలో లవ్ అఫైర్ లేదన్న షాహిద్ అఫ్రిదీ
వారిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని, షహీన్ తండ్రి స్వయంగా తన ఇంటికి వచ్చి పెళ్లి ప్రతిపాదన చేశారని అఫ్రిదీ వెల్లడించాడు. ప్రస్తుతం అక్సా వైద్య విద్య అభ్యసిస్తోందని, అటు షహీన్ కూడా కెరీర్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాడని, ఈ నేపథ్యంలో పెళ్లి ఇప్పట్లో ఉండకపోవచ్చని, వారిద్దరూ తమ కెరీర్లలో బాగా స్థిరపడ్డాకే పెళ్లి జరుగుతుందని అఫ్రిదీ స్పష్టం చేశాడు. ఈ పెళ్లికి ఇరువైపులా పెద్దలు అంగీకరించారని తెలిపాడు.