కరోనా ఎఫెక్ట్: ఏప్రిల్‌లో 75 లక్షల ఉద్యోగాల ఊస్టింగ్!
- లాక్‌డౌన్, ఆంక్షల కారణంగా ఊడుతున్న ఉద్యోగాలు
- ఏప్రిల్ నాటికి 7.97కు చేరుకున్నజాతీయ నిరుద్యోగిత రేటు
- భవిష్యత్తులో ఉద్యోగ కల్పన పెను సవాలుగా మారుతుందన్న సీఎంఐఈ
కాగా, మార్చిలో 6.50 శాతంగా ఉన్న జాతీయ నిరుద్యోగిత రేట ఏప్రిల్ నాటికి 7.97 శాతానికి చేరుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. పట్టణాల్లో నిరుద్యోగిత రేటు 9.13 శాతంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 7.13 శాతంగా ఉంది. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు అమలు చేస్తున్న ఆంక్షల ప్రభావం ఉద్యోగాలపై పడిందని వ్యాస్ పేర్కొన్నారు. అయితే, గతంలోలా దారుణ పరిస్థితులు లేకపోవడం కొంత ఊరట కలిగించే అంశమన్నారు. గతంలో నిరుద్యోగిత రేట 24 శాతానికి చేరుకుందని వ్యాస్ గుర్తు చేశారు.