భారత్‌కు అమెజాన్ సాయం.. విమానాల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు
- భారత్‌లో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత
- వివిధ సంస్థలు, ఎన్జీవోలతో చేతులు కలిపిన అమెజాన్
- సంక్షోభ సమయంలో భారత్ వెన్నంటే ఉంటామన్న ఈ-కామర్స్ దిగ్గజం
వీటిని భారత్‌కు వీలైనంత త్వరగా తరలించేందుకు ఆయా సంస్థలన్నీ భారత్‌తో కలిసి పనిచేస్తున్నాయి. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు, పబ్లిక్ ఇనిస్టిట్యూషన్స్‌కు వీటిని విరాళంగా ఇవ్వనున్నారు. దేశంలో కరోనా ప్రభావం ఊహించడానికి వీలులేనంతగా ఉందని, ఈ నేపథ్యంలో తాము భారత్ వెంటే ఉంటామని అమెజాన్ ఇండియా గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన సాయం అందిస్తామని స్పష్టం చేశారు.