'సర్కారువారి పాట'లో దుబాయ్ ఫైట్ హైలైట్ అట!
- 'సర్కారువారి పాట' షూటింగు వాయిదా
- మే 31న ఫస్టులుక్ వచ్చే అవకాశం
- మహేశ్ బర్త్ డేకి టీజర్ రిలీజ్
- సంక్రాంతికి భారీస్థాయి విడుదల
ఈ సినిమా కోసం దుబాయ్ లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. ఈ ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందట. మహేశ్ బాబు కెరియర్లోనే ఇది రిస్కీ ఫైట్ అని చెబుతున్నారు. ఈ సినిమా హైలైట్స్ లో ఇది ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం భారీగానే ఖర్చు చేశారట. ఆ ఖర్చు అంతా కూడా తెరపై కనిపిస్తుందని చెబుతున్నారు.
ఇక కృష్ణ పుట్టినరోజైన మే 31వ తేదీన ఈ సినిమా ఫస్టులుక్ రావొచ్చని అంటున్నారు. ఇక మహేశ్ బర్త్ డేకి టీజర్ ను వదిలే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.