రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు జానారెడ్డి గెలిచినా ఉపయోగం ఉండదు: తలసాని
- నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక
- టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్
- భగత్ తరఫున ప్రచారం చేసిన తలసాని, బాల్క సుమన్
- అధికారంలో ఉన్నప్పుడే జానా ఏం చేయలేదన్న తలసాని
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఇప్పుడు జానారెడ్డి గెలిచినా ఏంచేస్తారని విమర్శించారు. విద్యావంతుడైన నోముల భగత్ కు ఓటేయాలని, ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే భగత్ ను ఎన్నుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు తీరాలంటే టీఆర్ఎస్ నే గెలిపించాలని తలసాని పిలుపునిచ్చారు.