సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- తమన్నాకు భారీ పారితోషికం
- నాగ చైతన్యకు జోడీగా రాశిఖన్నా
- 'సారంగ ధరియా' పాట మరో రికార్డు
* 'మనం' ఫేమ్ విక్రంకుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా 'థ్యాంక్యూ' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా తాజాగా రాశిఖన్నాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
* శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' సినిమాలోని 'సారంగ ధరియా' పాట పెద్ద హిట్టయిన సంగతి విదితమే. మంగ్లీ పాడిన ఈ పాటలో కథానాయిక సాయిపల్లవి డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక యూ ట్యూబ్ లో ఈ పాట తాజాగా 100 మిలియన్ హిట్స్ ను దాటేసి, సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతోంది.