ఆస్ట్రాజెనెకాకు షాక్.. వ్యాక్సిన్ వాడకాన్ని ఆపేసిన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ
- వ్యాక్సిన్ వాడిన వారిలో రక్తం గడ్డ కడుతున్నట్టు ఫిర్యాదులు
- ఇప్పటికే ఆస్ట్రాజెనెకా వాడకాన్ని ఆపేసిన పలు దేశాలు
- ఆస్ట్రాజెనెకా సురక్షితమైనదని చెపుతున్న డబ్ల్యూహెచ్ఓ
ఇక ఈ దేశాలు ప్రకటనను వెలువరించిన వెంటనే... స్పెయిన్, పోర్చుగల్, స్లోవేనియా, లాత్వియా కూడా ఇదే ప్రకటన చేశాయి. ఆస్ట్రాజెనెకా వాడకాన్ని ఆపేస్తున్న దేశాల జాబితా యూరప్ ను దాటి ఇతర ఖండాలకు కూడా వ్యాపిస్తోంది. ఈ వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపివేస్తున్నట్టు ఆసియా దేశమైన ఇండొనేషియా కూడా ప్రకటించింది.
మరోవైపు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సురక్షితమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపింది. ఈ వ్యాక్సిన్ ను వాడుతున్న దేశాలు దానిని కొనసాగించాలని సూచించింది.