'రాధే శ్యామ్' సినిమాలో 'పోటుగాడు' భామ!

Simran Kour plays key role in Radhe Shyam
  • 'పోటుగాడు'లో నటించిన సిమ్రన్ కౌర్ 
  • ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్ కి
  • 'రాధే శ్యామ్' టీమ్ నుంచి ఫోన్ కాల్ 
  • కీలకమైన పాత్ర చేశానన్న సిమ్రన్  
కొంతమందికి ఒకదాని తర్వాత ఒకటిగా ఆఫర్లు వస్తుంటాయి. కొంతమందికి మాత్రం చాలా గ్యాప్ వచ్చేస్తుంటుంది. సిమ్రన్ కౌర్ విషయంలో కూడా అదే జరిగింది. మంచు మనోజ్ హీరోగా నటించిన 'పోటుగాడు' సినిమా ద్వారా ఈ చిన్నది అప్పట్లో టాలీవుడ్ కి పరిచయం అయింది. అయితే, ఆ సినిమా ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. అందుకే ఆ వెంటనే టాలీవుడ్ నుంచి ఆఫర్లు రాలేదు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత సిమ్రన్ కు మళ్లీ తెలుగు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అది కూడా ప్రభాస్ సినిమా కావడం విశేషం!

రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రాధే శ్యామ్' పేరిట ఓ రొమాంటిక్  యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతున్న సంగతి విదితమే. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ చిత్రంలో సిమ్రన్ కౌర్ ఓ ముఖ్య పాత్ర పోషించింది. దీని గురించి 'ఈ చిన్నది చెబుతూ, ఆమధ్య 'రాధేశ్యామ్' టీమ్ నుంచి కాల్ వచ్చింది. ఓ క్యారెక్టర్ వుంది చేస్తారా? అని అడిగారు. వెంటనే ఒప్పేసుకున్నాను. ఇందులో నాది కీలమైన మంచి పాత్ర, ఇందులో నటించినందుకు హ్యాపీగా వుంది' అని చెప్పింది.  
Go Back to Shorts
Simran Kour
Prabhas
Pooja Hegde
Radhe Shyam

More Telugu News