Sathyameva Jayathe: రేపు పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రం నుంచి 'సత్యమేవ జయతే' లిరికల్ సాంగ్
బాలీవుడ్ లో హిట్టయిన పింక్ చిత్రాన్ని తెలుగులో 'వకీల్ సాబ్' గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'పింక్'లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను 'వకీల్ సాబ్' లో పవన్ కల్యాణ్ పోషిస్తుండడంతో సినిమాకు భారీ హైప్ వచ్చింది. కాగా, ఈ చిత్రబృందం నుంచి తాజా అప్ డేట్ వచ్చింది. రేపు సాయంత్రం 5 గంటలకు 'వకీల్ సాబ్' సినిమాలోని 'సత్యమేవ జయతే' అనే పాట లిరికల్ వీడియో రిలీజ్ చేయనున్నారు.
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ కథానాయిక కాగా, కీలకపాత్రల్లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. 'వకీల్ సాబ్' చిత్రం ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.