మోదీ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదే... వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉంటే ఇంకా మంచిది: అసదుద్దీన్ ఒవైసీ
- ఇవాళ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని మోదీ
- పేద, మధ్య తరగతి ప్రజలకూ అందుబాటులోకి తేవాలన్న ఒవైసీ
- తక్కువధరలో వ్యాక్సిన్ అందించేలా చూడాలని విజ్ఞప్తి
- పాత్రికేయులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని వినతి
- 64 ఏళ్లకు పైబడిన వారికి కరోనా టీకా అంశంలో స్పష్టత ఇవ్వాలన్న ఒవైసీ
అయితే, కరోనా టీకాపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని అన్నారు. 64 ఏళ్లకు పైబడిన వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదేనా అనే అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక, కరోనా వ్యాప్తి సమయంలో ముందు నిలిచి కృషి చేసిన వారిలో పాత్రికేయులు కూడా ఉన్నారని, అందుకే ప్రతి ఒక్క పాత్రికేయుడికి కరోనా వ్యాక్సిన్ ఇప్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఒవైసీ విజ్ఞప్తి చేశారు.