నాకు ఎలాంటి కలలు లేవు, రోల్ మోడళ్లూ లేరు: నిర్మలా సీతారామన్
- బెంగళూరు చాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ కార్యక్రమంలో నిర్మలా వ్యాఖ్యలు
- మీకు కలలు ఉండేవా అన్న ప్రశ్నకు సమాధానం
- పరిస్థితులను బట్టి నడుచుకునేదాన్నని వెల్లడి
- విధి తనను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని వివరణ
జీవితాన్ని ఇలా నిర్మించుకోవాలన్న ప్రణాళికలు ఉండేవి కావని, తన ముందున్న దారిలో నడిచానని, విధి తనను ఇక్కడికి వరకు తీసుకొచ్చిందని వివరించారు. తనకు తెలిసిందల్లా మెరుగైన పనితీరు కనబర్చడమేనని, అందుకే తనకు ఈ బాధ్యతలు అప్పగించిన వారిని నిరాశపర్చకుండా ముందుకు పోతానని తెలిపారు. భారతదేశ ప్రజలను నిరుత్సాహానికి గురిచేయాలని కోరుకోవడంలేదని నిర్మలా పేర్కొన్నారు.