అమెజాన్ తీరు అనైతికం... భారత వ్యాపార సంఘాల సమాఖ్య తీవ్ర అసంతృప్తి
- అమెజాన్ ను నిషేధించాలన్న సీఏఐటీ
- చిరు వ్యాపారులను దెబ్బతీస్తోందని ఆరోపణ
- ఫెమా లొసుగులను ఉపయోగించుకుంటున్నట్టు వెల్లడి
- ఈ-కామర్స్ సంస్థల వ్యాపార విధానాలపై దర్యాప్తుకు డిమాండ్
దీనిపై సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ స్పందిస్తూ... భారీ నిధులు కలిగివున్న అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థల విధానాలపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఈ రెండు ఈ-కామర్స్ సంస్థలు ఫెమా (విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం)లోని లొసుగులను ఆసరాగా చేసుకుని వ్యాపార రంగంలో పోటీని అణగదొక్కుతున్నాయని ఖండేల్వాల్ ఆరోపించారు.