అక్కినేని హీరోతో మరోసారి పూజ హెగ్డే
- తెలుగు, హిందీ భాషల్లో రాణిస్తున్న పూజ హెగ్డే
- నాగ చైతన్య హీరోగా విక్రంకుమార్ 'థ్యాంక్యూ'
- చైతు సరసన ఇందులో ముగ్గురు హీరోయిన్లు
- ప్రధాన కథానాయిక పాత్రకు పూజ ఎంపిక
'మనం' ఫేమ్ విక్రంకుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'థ్యాంక్యూ' అనే టైటిల్ని కూడా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది.
ఇక ఇందులో చైతు పక్కన మొత్తం ముగ్గురు హీరోయిన్లు వుంటారట. వారిలో మెయిన్ హీరోయిన్ పాత్రకు పూజ హెగ్డేను తాజాగా ఎంపిక చేసినట్టు, ఈ సినిమా చేయడానికి ఆమె కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అన్నట్టు, పూజ తెలుగులో తన కెరీర్ ప్రారంభంలో చైతు సరసన 'ఒక లైలా కోసం' అనే సినిమాలో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.