YSRCP: విజయవాడలో నడిరోడ్డుపై బీర్లు తాగుతూ వైసీపీ కార్యకర్తల వీరంగం!

YCP Workers drinking beer middle of the road and broke them
  • ఖాళీ సీసాలను రోడ్డు మధ్యలో పగలగొట్టి బీభత్సం
  • బైక్ విన్యాసాలతో హడలెత్తించిన వైనం
  • అరగంట పాటు కొనసాగిన వికృత చేష్టలు
విజయవాడలో వైసీపీ కార్యకర్తలు చెలరేగిపోయారు. నడిరోడ్డుపై బీర్లు తాగుతూ, ఖాళీ సీసాలను పగలగొడుతూ జనాలను హడలెత్తించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కొందరు నాయకులు మంత్రి వెల్లంపల్లి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి వెళ్లే క్రమంలో కార్యకర్తలు నానా హంగామా చేశారు. నడిరోడ్డుపై బీర్లు తాగుతూ, వాటిని పగలగొడుతూ, బైకులతో భయంగొల్పే విన్యాసాలు చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు. వీరి విపరీత చేష్టలు అరగంటపాటు కొనసాగాయి.
YSRCP
Vijayawada
Vellampalli Srinivasa Rao
Andhra Pradesh

More Telugu News