తెలంగాణ‌లో కరోనా కేసుల అప్‌డేట్స్‌!
Add ap7am to your home Screen

తెలంగాణ‌లో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

221 new cases in telangana
  • కొత్తగా 221 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,93,056
  • కోలుకున్న వారు 2,87,899 మంది
  • మృతుల సంఖ్య 1,588
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 221 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 431 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,93,056కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,87,899 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,588కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 3,569 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1973 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 36 కరోనా కేసులు నమోదయ్యాయి.
Telangana
Corona Virus
COVID19

More Telugu News