కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్ స్టిట్యూట్ లో భారీ అగ్నిప్రమాదం
- పూణేలో అగ్నిప్రమాదం
- సీరం కేంద్రంలో టెర్మినల్ 1 వద్ద చెలరేగిన అగ్నికీలలు
- వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది
- నలుగురిని కాపాడిన సహాయక బృందాలు
- కరోనా వ్యాక్సిన్ నిల్వ కేంద్రం సురక్షితం
కాగా, అగ్నిప్రమాదం నేపథ్యంలో భవనంలో చిక్కుకుపోయిన నలుగురిని సహాయక బృందాలు కాపాడాయి. సహాయక చర్యలను సమీక్షిస్తున్న పూణే మేయర్ మురళీధర్ మహోల్ పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపారు. ఈ అగ్నిప్రమాదంతో దట్టమైన పొగలు ఆకాశాన్నంటేలా వెలువడడంతో నగర వాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి కేంద్రంలో ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ ను భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు.