నాలుగేళ్ల బుడతడి క్రికెట్ టాలెంట్ కు కేటీఆర్ ఫిదా... ఏమంటావు లక్ష్మణ్? అంటూ ట్వీట్
Add ap7am to your home Screen

నాలుగేళ్ల బుడతడి క్రికెట్ టాలెంట్ కు కేటీఆర్ ఫిదా... ఏమంటావు లక్ష్మణ్? అంటూ ట్వీట్

KTR feels amazing after seen a kid with immense cricketing talent
  • నెట్టింట వైరల్ అవుతున్న చిన్నారి క్రికెట్ వీడియో
  • కచ్చితమైన టెక్నిక్ తో షాట్లు కొడుతున్న చిన్నారి
  • అచ్చెరువొందిన కేటీఆర్
  • ప్రత్యేక నైపుణ్యం అంటూ లక్ష్మణ్ స్పందన
సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడో బుడతడి క్రికెట్ వీడియో వైరల్ అవుతోంది. డైపర్లు తొడుక్కునే వయసులోనే బ్యాట్ పట్టి అలవోకగా కవర్ డ్రైవ్ లు ఆడుతూ, ఇప్పుడు నాలుగేళ్ల వయసులో మరింత టాలెంట్ చూపుతున్న ఓ చిన్నారిని ఆ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను ఎస్కే షాహిద్ అనే నెటిజన్ పంచుకున్నాడు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేయగా, ఆయన ఈ వీడియో చూసి అచ్చెరువొందారు. అమోఘమైన ప్రతిభ అంటూ కితాబునిచ్చారు. అంతేకాదు, ఈ వీడియో పట్ల ఏమంటారు వీవీఎస్ లక్ష్మణ్, హర్షాభోగ్లే? అంటూ వారిద్దరినీ ట్యాగ్ చేశారు.

దీనిపై లక్ష్మణ్ వెంటనే స్పందించారు. నిజంగానే ఆ చిన్నారిలో అద్భుత నైపుణ్యం ఉందని తాను అంగీకరిస్తానని ట్వీట్ చేశారు. ఇంత చిన్న వయసులోనే కచ్చితమైన టెక్నిక్ తో ఆడుతున్న ఆ చిన్నారిలో ప్రత్యేక ప్రతిభ ఉందని పేర్కొన్నారు.
KTR
Kid
Batting
Cricket
VVS Laxman
Telangana

More Telugu News