వ్యాక్సిన్ ఇస్తున్నాం... ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సమాచారం!
- ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ
- 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారం
- నేడు మరోసారి దేశవ్యాప్త డ్రైరన్
- విజయవంతం చేయాలన్న ఆరోగ్య శాఖ
తదుపరి దశలో ఇందుకు సంబంధించిన విధివిధానాలతో కూడిన సూచనలను పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలకు వ్యాక్సిన్ ను పంపేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. రిజిస్టర్ చేసుకున్న వారికి తొలుత ఇవ్వాలని, ఆ సంఖ్య ఆధారంగా ఏ జిల్లాకు ఎన్ని టీకాలు పంపాలన్న విషయమై ముందుగానే ఓ అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు.
ఇదిలావుండగా, నేడు మరో విడత దేశవ్యాప్త టీకా డ్రైరన్ కొనసాగనుంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ, టీకా పంపిణీలో ఎదురయ్యే సవాళ్ల గురించి అవగాహన తెచ్చుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. నేడు 33 రాష్ట్రాల్లోని 746 జిల్లాల్లో డ్రైరన్ సాగనున్నదని, దీన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
కాగా, ఇండియాలో రెండు వ్యాక్సిన్లకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనికాల వ్యాక్సిన్ తో పాటు, భారత్ బయోటెక్ తయారు చేసిన టీకాలను అత్యవసర వినియోగం నిమిత్తం వాడవచ్చని నియంత్రణా సంఘాలు అనుమతించాయి. అయితే, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఇంకా మూడవ దశ పరీక్షల ఫలితాలను వెల్లడించనందున ప్రస్తుతానికి ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ టీకానే పంపిణీ చేయనున్నారు.