ప్రభాస్ అభిమానులకు 'రాధే శ్యామ్' దర్శకుడి ప్రామిస్
- టాలీవుడ్ భారీ చిత్రాలలో 'రాధే శ్యామ్' ఒకటి
- టీజర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
- త్వరలోనే వస్తుందంటున్న దర్శకుడు రాధాకృష్ణ
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫొటోలు, టీజర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరో టీజర్ అప్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తాజాగా స్పందించాడు.
"టీజర్ గురించిన అప్ డేట్ అతి త్వరలోనే మీ ముందుంటుంది. అంతవరకూ కాస్త ఓపిక పట్టండి. మీ ఓపికకు న్యాయం చేకూర్చేలా ఆ టీజర్ ఉంటుందని మాత్రం ప్రామిస్ చేస్తున్నాను' అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ప్రభాస్ సరసన పూజ హెగ్డే ఇందులో కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే. దీనికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతానని అందిస్తున్నాడు.