చైనా ఒక్కటే మాకు గురువు.. వాళ్ల నుంచే నేర్చుకుంటాం!: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్
- గత కొంతకాలంగా పాక్ కు దన్నుగా నిలుస్తున్న చైనా
- పాక్ ను రుణభారం నుంచి గట్టెక్కించేందుకు చర్యలు
- చైనాను ఆకాశానికెత్తేసిన పాక్
- చైనా అభివృద్ధి విధానంపై పొగడ్తలు
చైనా అభివృద్ధి చెందిన విధానం ఎంతో ప్రత్యేకమని, వారి పంథా పాకిస్థాన్ కు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. గత మూడు దశాబ్దాల కాలంలో చైనా అందుకున్న అభివృద్ధి తమకు స్ఫూర్తిదాయకం అని ఇమ్రాన్ వివరించారు. పేదరికాన్ని రూపుమాపడమే నిజమైన పురోగతి అని చైనా చాటిందని, అందుకే, ప్రపంచంలో ఏ దేశం నుంచైనా అభివృద్ధి పాఠాలు నేర్చుకోదలిస్తే ఒక్క చైనా నుంచే నేర్చుకుంటామని తమ వైఖరిని చాటారు. ఇస్లామాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.