వెంకటేశ్ తో నా స్నేహం ఎంతో ప్రత్యేకమైనది: పవన్ కల్యాణ్
- నేడు వెంకటేశ్ పుట్టినరోజు
- శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
- హీరో అవకముందే వెంకీతో పరిచయం ఉందని వెల్లడి
- ఆయన పుస్తకాలు బాగా చదువుతారని వివరణ
- ఆ స్నేహమే గోపాల గోపాల చిత్రంలో నటించేలా చేసిందన్న పవన్
"ఆయన పుస్తకాలు ఎక్కువగా చదువుతారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక, ధార్మిక, లౌకిక సంబంధ పుస్తకాలు చదివేవారు. ఆ పుస్తకాల్లోని సంగతులు వివరించేవారు. ఆ సంభాషణలు, చర్చలు మా స్నేహాన్ని మరింత బలోపేతం చేశాయి. ఇప్పటికీ మా మధ్య సినిమా సంగతులతో పాటు హైందవ ధర్మం, భక్తికి సంబంధించిన విషయాలు చర్చకు వస్తుంటాయి.
ఆ స్నేహమే గోపాల గోపాల చిత్రంలో నటించేలా చేసింది. మా ఆలోచనలకు ఆ సినిమా అద్దంపట్టింది" అని పవన్ వివరించారు. కొత్తతరం దర్శకుల కథలకు, ఆలోచనలకు అనుగుణంగా తనను తాను మలచుకునే వెంకటేశ్ మరిన్ని విజయాలతో ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.