తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!
Add ap7am to your home Screen

తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

new  573 COVID19 infections in telangana
  • 24 గంటల్లో 573 కరోనా కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,77,724
  • కోలుకున్న 2,68,601 మంది
  • మృతుల సంఖ్య మొత్తం 1,493
తెలంగాణలో గత 24 గంటల్లో 573 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 609 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,77,724కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,68,601 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,493కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 7,630 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 5,546 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 127, రంగారెడ్డి జిల్లాలో 58 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
 
Corona Virus
COVID19
Telangana

More Telugu News