దుల్ఖర్ సరసన మరో నాయికగా రాశిఖన్నా

Rashi khanna opposite Dulkhar
  • దుల్ఖర్ సల్మాన్ హీరోగా ద్విభాషా చిత్రం  
  • హను రాఘవపూడి దర్శకత్వం
  • ఒక నాయికగా పూజ హెగ్డే ఎంపిక
  • వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్  
'మహానటి' సినిమాతో తెలుగులో కూడా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న మలయాళ నటుడు దుల్ఖర్ సల్మాన్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. హను రాఘవపూడి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని 'స్వప్న సినిమా' బ్యానర్ పై స్వప్న దత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దుల్ఖర్ మిలటరీ ఆఫీసర్ పాత్రను పోషించనున్నారు. 1960ల కాలంలో సాగే ప్రేమకథగా ఇది తెరకెక్కుతుంది.

ఇక ఇందులో ఇద్దరు కథానాయికలు నటించనున్నారు. వీరిలో ఒకరిగా ఇప్పటికే అగ్రతార పూజ హెగ్డేను ఖరారు చేశారు. రెండో నాయికగా రష్మిక నటించనుందని, ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయనీ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఈ పాత్రకు తాజగా రాశీఖన్నాను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. కథ నచ్చడంతో చేయడానికి రాశి వెంటనే ఓకే చెప్పిందట.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలావరకు పూర్తయ్యాయి. వచ్చే నెల నుంచి హైదరాబాదులో షూటింగును నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు.
Go Back to Shorts
Rashi Khanna
Dulkhar
Pooja Hegde
Swapna Dath

More Telugu News