కానిస్టేబుల్ అంతిమయాత్రలో పాడె మోసిన సజ్జనార్
- రోడ్డుప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
- బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించిన వైద్యులు
- సహచరుడికి సీపీ ఘననివాళి
సీపీ సజ్జనార్ సూచన మేరకు ఆంజనేయులు అవయవాలను కుటుంబ సభ్యులు ఇతరులకు దానం చేశారు. ఇక, ఆంజనేయులు కానిస్టేబుల్ గా అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన అంతిమయాత్రలో సీపీ సజ్జనార్ కూడా పాల్గొన్నారు. పాడె మోసి తమ పోలీసు సహచరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.