కాబూల్ పై రాకెట్ల వర్షం... వీడియో ఇదిగో!
- నగరాన్ని కుదిపేసిన రాకెట్లు
- ఐదుగురి దుర్మరణం, 20 మందికి పైగా గాయాలు
- తాము దాడులు చేయలేదన్న తాలిబాన్లు
అంతకుముందు రెండు ఐఈడీ బాంబులు కూడా పేలాయి. ఇక ఈ దాడుల వెనుక ఎవరున్నారన్న విషయాన్ని గుర్తించలేదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా దాడులకు తామే పాల్పడ్డామని ప్రకటించలేదు. తాలిబాన్లు మాత్రం ఈ రాకెట్ దాడులకు తాము కారణం కాదని స్పష్టం చేసింది. కాబూల్ నగరంపై రాకెట్ల దాడి, ప్రజలు తీవ్ర ఆందోళనతో పరుగులు పెడుతుండటం, వాహనాలు ధ్వంసం కావడం వంటి దృశ్యాలతో కూడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.