అక్కినేని హీరో సినిమాలో రష్మిక!
- అఖిల్ తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'
- సంక్రాంతికి విడుదల చేసే ప్రయత్నాలు
- సురేందర్ రెడ్డితో అఖిల్ తదుపరి చిత్రం
ఇదిలావుంచితే, తన ఐదో చిత్రాన్ని అఖిల్ ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక ఇందులో కథానాయికగా నేటి బిజీ స్టార్ హీరోయిన్ రష్మిక నటించనున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని సమాచారం. సురేందర్ రెడ్డి సినిమా అంటే యాక్షన్ ఎంటర్ టైనర్ కాబట్టి ఆ రేంజిలోనే బడ్జెట్టు కూడా వుంటుందట.