Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

1015 new cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 1,015 కరోనా కేసులు  నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో  ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,716 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,54,666 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,35,950 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,393 కి చేరింది. ప్రస్తుతం 17,323 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 14,694 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 172 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 98 కేసులు నిర్ధారణ అయ్యాయి.  
 
  
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News