చెప్పినట్లుగానే కీలక ప్రకటన చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్
Add ap7am to your home Screen

చెప్పినట్లుగానే కీలక ప్రకటన చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్

ktr tweets about investments
  • తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడులు
  • రాష్ట్రంలో రూ.20,761 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
  • అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంగీకారం
  • కార్యకలాపాలు 2022లో ప్రారంభం 
ఈ రోజు ఓ కీలక ప్రకటన చేస్తానంటూ ట్విట్టర్‌లో నిన్న ప్రకటించిన తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ప్రజలను సస్పెన్స్ లో పెట్టారు. చెప్పినట్లు గానే ఆయన ఈ రోజు ఓ ప్రకటన చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో రూ.20,761 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంగీకరించిందని చెప్పారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ హైదరాబాద్ కార్యకలాపాలు 2022లో ప్రారంభం కానున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా కేబుళ్లు ఏర్పాటు చేయనుంది.

కాగా, నిన్న కేటీఆర్ పెట్టుబడులకు సంబంధించి మరో ప్రకటన కూడా చేశారు. ప్ర‌పంచంలోనే అతిపెద్దదైన వ‌న్‌ప్ల‌స్ స్టోర్ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంద‌ని అన్నారు. త్వ‌ర‌లోనే వ‌న్‌ప్ల‌స్ స్టోర్‌ను విజిట్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీదారు వన్‌ప్లస్‌ నిన్న హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్ లో తన అతిపెద్ద ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ను ప్రారంభించింది. దీన్ని ‘వన్‌ప్లస్‌ నిజాం ప్యాలెస్‌' పేరుతో 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.
KTR
TRS
Telangana

More Telugu News