కృష్ణమ్మ వరదలో కొట్టుకుపోయిన హీరో శర్వానంద్ తాతయ్య ఇల్లు!
- అవనిగడ్డ సమీపంలో నది ఒడ్డున ఇల్లు
- తాజా వరదల్లో నీటిలో మునక
- ఆవేదనతో తిలకించిన గ్రామస్థులు
గతంలో ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా శర్వానంద్ ఇక్కడే ఉండేవాడు. ఈ భవనం కృష్ణా నది వరద నీటిలో కొట్టుకుపోతుంటే, స్థానికులు పెద్దఎత్తున గుమికూడి ఆవేదనతో చూస్తుండిపోయారు. గత సంవత్సరం వచ్చిన వరదల్లో శర్వానంద్ ముత్తాత, హరిప్రసాద్ తండ్రి నివసించిన ఇల్లు నదిలో కొట్టుకుపోగా, ఈ సంవత్సరం తాతయ్య ఇల్లు కొట్టుకుపోయింది. వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో, పాతకాలం ఇల్లయిన ఈ పెంకుటిల్లు పునాదులు కదిలిపోయి, నదిలో కలిసిపోయింది.