20న బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం... వర్షాలు ఇప్పట్లో తగ్గబోవంటున్న వాతావరణ శాఖ!
- ఉపరితల ద్రోణితో ఇప్పటికే వర్షాలు
- గత 24 గంటల్లో పలు చోట్ల భారీ వర్షం
- మరో రెండు రోజులు వర్షాలు
గడచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో నిత్యమూ ఏదో ఒక సమయంలో భారీ వర్షం కాసేపు పలకరిస్తూనే ఉంది. ఇక రాగల 48 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.