ఆసియాలోనే అతి పెద్ద అవినీతి దేశం భారత్: ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్

India is highly corrupted country in Asia
  • 69 శాతం అవినీతితో భారత్ అగ్రస్థానం
  • 65 శాతం అవినీతితో రెండో స్థానంలో వియత్నాం
  • పాకిస్థాన్ లో 40 శాతం అవినీతి
ఏ దేశం కోరుకోని అప్రతిష్టను భారత్ మూటకట్టుకుంది. ఆసియా ఖండంలోని అత్యంత అవినీతి దేశాల్లో తొలి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ వెల్లడించింది. జర్మనీకి చెందిన ఈ సంస్థ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ సంస్థ నివేదికను ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది.

ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 69 శాతం అవినీతితో ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. మన శత్రుదేశం పాకిస్థాన్ మనకంటే మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం. పాకిస్థాన్ లో 40 శాతం అవినీతి నమోదైంది. ఈ జాబితాలో 65 శాతం మంది లంచాలు తీసుకునేవారితో వియత్నాం రెండో స్థానంలో నిలిచింది. థాయిలాండ్ లో 41 శాతం అవినీతి ఉన్నట్టు తేలింది. జపాన్ కేవలం 0.2 శాతం అవినీతితో చివరి స్థానంలో ఉంది.

భారత్ లో ప్రతి 10 మందిలో ఏడుగురు ఏదో ఒక సందర్భంలో లంచాలు ఇచ్చేవారేనని ఈ సర్వేలో తేలింది. ప్రాథమిక సౌకర్యాల కల్పనకు కూడా  లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్పింది. పబ్లిక్ స్కూల్స్, ఆసుపత్రుల్లో కూడా లంచాల బెడద ఉందని తెలిపింది. ఈ సర్వే ఫలితాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. భారత్ లో ఇంత భారీ స్థాయిలో అవినీతి ఉందా అనే చర్చ ప్రపంచ దేశాల్లో జరుగుతోంది.
Go Back to Shorts
Corruption
India
Transperancy International

More Telugu News