ముస్లిం సమాజాన్ని యూఏఈ దారుణంగా మోసం చేసింది: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీ
- ఇజ్రాయెల్ తో డీల్ కుదుర్చుకోవడం దారుణం
- యూదుల కోసం యూఏఈ ద్వారాలు తెరిచింది
- పాలస్తీనా గురించి పట్టించుకోవడం లేదు
యూఏఈతో పాటు సౌదీ అరేబియా కూడా ఇజ్రాయెల్ కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖొమైనీ విమర్శలు గుప్పించారు. యూదుల కోసం యూఏఈ పాలకులు ద్వారాలను తెరిచారని మండిపడ్డారు. పాలస్తీనా గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ విషయంలో యూఏఈ త్వరలోనే పశ్చాత్తాపానికి గురవుతుందని చెప్పారు.