వరుణ్ తేజ్ కోసం పోలీస్ స్టోరీ సిద్ధం!
- మన హీరోలకు పోలీస్ పాత్రలపై క్రేజ్
- సాగరచంద్రకు ఓకే చెప్పిన వరుణ్
- వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం
వరుణ్ కోసం దర్శకుడు సాగరచంద్ర ఓ పవర ఫుల్ పోలీసాఫీసర్ పాత్రతో కూడిన కథను సిద్ధం చేశాడట. అది వరుణ్ కి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఇంతకుముందే సెట్స్ కి వెళ్లాలి. వేరే కారణాల వల్ల ఆలస్యమైందంటున్నారు. ప్రస్తుతం వరుణ్ స్పోర్ట్స్ డ్రామా 'బాక్సింగ్' చేస్తున్నాడు. దీని తర్వాత అనిల్ రావిపూడితో 'ఎఫ్ 3' చేయాల్సివుంది. దాని తర్వాత వచ్చే ఏడాది ఈ పోలీస్ స్టోరీ సెట్స్ కి వెళుతుందట. దీనిని '14 రీల్స్ ప్లస్' బ్యానర్ పై భారీ చిత్రంగా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.