టిక్ టాక్ అమెరికాకు ప్రమాదకరం కావచ్చు: ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్
- టిక్ టాక్ ప్రమాదకరం
- యూఎస్ సాంకేతికతకు విఘాతం కలగవచ్చు
- చైనా సంస్థలు ప్రమాదకరం
ఈ నేపథ్యంలో, ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా భద్రతకు టిక్ టాక్ ప్రమాదకరం కాగలదన్న ట్రంప్ సర్కార్ ఆరోపణలను ఆయన సమర్థించారు. టిక్ టాక్ వల్ల అమెరికా సాంకేతిక ఆధిపత్యానికి విఘాతం కలగవచ్చని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో జుకర్ బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాకు చెందిన సోషల్ మీడియా సంస్థలు చాలా ప్రమాదకరమని... వాటి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మరోవైపు, టిక్ టాక్ ను నిషేధిస్తామన్న ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని టిక్ టాక్ ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఏం జరగనుందో వేచి చూడాలి.