ప్రభాస్ సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్!
Add ap7am to your home Screen

ప్రభాస్ సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్!

Saif Ali Khan to act villain character in Prabhas movie Adipurush
  • ప్రభాస్ తదుపరి చిత్రం 'ఆదిపురుష్'
  • ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం
  • సైఫ్ నటిస్తున్నాడంటూ బీటౌన్ లో ప్రచారం
స్టార్ హీరో ప్రభాస్ మరో ప్యాన్ ఇండియా చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఆదిపురుష్' అనే పేరు పెట్టారు. మొత్తం ఐదు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారమవుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించబోతున్నట్టు బీటౌన్ లో చర్చ జరుగుతోంది. ఓం రౌత్ తెరకెక్కించిన 'తానాజీ' చిత్రంలో కూడా సైఫ్ కీలక పాత్రను పోషించారు. మరోవైపు ప్రభాస్, సైఫ్ కాంబినేషన్లో ఈ సినిమా సూపర్ హిట్ కావడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు.
Prabhas
Saif Ali Khan
Tollywood
Bollywood
Adipurush Movie

More Telugu News