కరోనా నుంచి కోలుకున్న అంబటి రాంబాబు... ఇంటికొచ్చేశానంటూ ట్వీట్

Ambati Rambabu cured from Corona and discharged
ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఈ విషయం స్వయంగా ఆయనే వెల్లడించారు. "మీ అందరి ఆశీస్సుల వల్ల కోలుకున్నాను. కరోనా సోకడంతో 10 రోజుల పాటు ట్రీట్ మెంట్ తీసుకుని నెగెటివ్ రావడంతో డిశ్చార్జి అయ్యి ఈరోజే ఇంటికి వచ్చాను. అయితే ఓ వారం పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. నేను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Ambati Rambabu
Corona Virus
Discharge
YSRCP
Andhra Pradesh

More Telugu News